paruchuri: ఆ దర్శకుడికి మాపై కోపం వచ్చేసింది: పరుచూరి గోపాలకృష్ణ

  • తన సినిమాలకి మాత్రమే రాయాలన్నారు 
  • వేరే సినిమాల అడ్వాన్సులు తీసుకుని వున్నాం 
  • ఆయనకి కోపం వచ్చేసి వెళ్లిపోయారు    

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, దర్శకుడు వేజెళ్ల సత్యనారాయణ గురించి ప్రస్తావించారు. 'ఈ చదువులు మాకొద్దు' కథా చర్చలు పూర్తయిన తరువాత, వేజెళ్ల సత్యనారాయణగారితో మా అనుబంధం దెబ్బతింది. ఒక రోజున ఆయన వచ్చి 'నా సినిమాలకి తప్ప వేరే సినిమాలకి మీరు రాయడానికి వీల్లేదు' అని షరతు పెట్టారు.

అప్పటికి మేము కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు .. చిరంజీవి ఇలా చాలామంది సినిమాలకి రాస్తున్నాము. 'ఆ సినిమాలకి అడ్వాన్సులు కూడా తీసుకుని మధ్యలో ఎలా వదిలేస్తాం సార్ .. కుదరదు' అని చెప్పాము. దాంతో ఆయనకి కోపం వచ్చేసి 'నేను వదిలిస్తే మీరు పాండీ బజార్లోకి వెళ్లిపోతార్రా' అని అన్నారు. 'సార్ .. మీరు పెద్దవారండి .. అలా శపించకండి .. మా పరిస్థితిని అర్థం చేసుకోండి. మీరు నాటిన మొక్క ఇంతపెద్దది అయినందుకు సంతోషించండి' అని చెప్పాను. ఆ రోజున కోపంతో వెళ్లిపోయిన ఆయన, ఆ తరువాత కొంత కాలానికి నా దగ్గరికి వచ్చి, ఆ రోజున శపించినందుకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు" అని చెప్పుకొచ్చారు.    

More Telugu News