Balakrishna: నందమూరి బాలకృష్ణకు షాకిచ్చిన ఈసీ.. రోడ్ షో కు అనుమతి నిరాకరణ!

  • డిసెంబర్ 1 నుంచి ప్రచారంలో పాల్గొంటున్న నేత
  • ఈసీకి ముందస్తు సమాచారం ఇవ్వని వైనం
  • నేడు ప్రచారానికి దూరం కానున్న బాలయ్య

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నందమూరి బాలకృష్ణకు ఎన్నికల సంఘం(ఈసీ) షాకిచ్చింది. ఈ రోజు జరగాల్సిన రోడ్ షో లో పాల్గొనేందుకు అనుమతిని నిరాకరించింది. దీంతో టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ఈ నెల 1 నుంచి బాలకృష్ణ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

అయితే ఎన్నికల ప్రచారం నిర్వహించే వ్యక్తులు ఆ సమాచారాన్ని ఈసీకి 48 గంటలు ముందుగా ఇవ్వాలి. అయితే టీడీపీ శ్రేణులు ఈ విషయాన్ని మర్చిపోయాయి. దీంతో బాలయ్యకు షాక్ ఇస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. కాగా, ఎన్నికల కమిషన్ నిర్ణయం నేపథ్యంలో బాలయ్య ప్రచారానికి దూరం కానున్నారు.

More Telugu News