AP government: ఏపీ సర్కార్‌కు హైకోర్టు అక్షింతలు...జగన్‌పై దాడి కేసు కేంద్రానికి రిఫర్‌ చేయక పోవడంపై ఆగ్రహం

  • సెక్షన్‌ 3 వర్తించదన్న అడ్వకేట్‌ జనరల్‌ వాదనతో ఏకీభవించని ధర్మాసనం
  • కేసును ఎన్‌ఐఏకు ఇవ్వాలా, వద్దా అన్నది నిర్ణయించి చెప్పాలని కేంద్రానికి ఆదేశం
  • తదుపరి విచారణ 14వ తేదీకి వాయిదా

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌ పోర్టులో అక్టోబరు 25వ తేదీన జరిగిన దాడి విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానాశ్రయం లాంజ్ లో శ్రీనివాస్ అనేవ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డిపై కత్తితో దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ కేసును కేంద్రానికి తెలియజేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది.

జగన్‌పై దాడి కేసును బుధవారం మరోసారి విచారించిన ధర్మాసనం ముందు ఏపీ సర్కారు తరపున అడ్వకేట్‌ జనరల్‌ తన వాదనలు వినిపించారు. ఈ కేసుకు సెక్షన్‌ 3 వర్తించదని, వ్యక్తిగత దాడిగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వమే దర్యాప్తు చేపడుతుందన్న అడ్వకేట్‌ జనరల్‌ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించ లేదు. ఈ కేసును ఎన్‌ఐఏకు ఇవ్వాలా, వద్దా? అన్న విషయంపై ఈనెల 14వ తేదీలోగా నిర్ణయించి తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది.

More Telugu News