venkatesh: 'ఎఫ్ 2' లో అనసూయ స్పెషల్ సాంగ్

  • నాన్ స్టాప్ నవ్వులతో సాగే కథ 
  • దేవిశ్రీ కంపోజ్ చేసిన స్పెషల్ సాంగ్ 
  • సంక్రాంతి పండుగకి భారీ విడుదల   

దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' సినిమా రూపొందుతోంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా చేస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో అనసూయ మెరవనున్నట్టు తెలుస్తోంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. అనసూయలపై ఈ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టు సమాచారం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట.

దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తుందని అంటున్నారు. వెంకటేశ్ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడిగా మెహ్రీన్ నటిస్తోన్న ఈ సినిమా, నాన్ స్టాప్ నవ్వులతో కొనసాగుతుందని చెబుతున్నారు. అనిల్ రావిపూడి వరుస హిట్లు కొడుతుండటంతో, ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

More Telugu News