paruchuri: నటన నాకు కొత్త .. గుమ్మడి గారు అంతమాట అనేశారు: పరుచూరి గోపాలకృష్ణ

  • నన్ను నటుడిని చేసింది వేజెళ్ల గారు 
  • 'ఈ పిల్లకి పెళ్లవుతుందా' నాకు ఫస్టు సినిమా
  • ఆశీర్వదించండి అని గుమ్మడిగారితో అన్నాను    

సినీ రచయితగా వందలాది సినిమాలకి పనిచేసిన అనుభవం పరుచూరి గోపాలకృష్ణ సొంతం. రచయితగా తన ప్రయాణంలో అనేక విషయాలను ఆయన 'పరుచూరి పలుకులు' కార్యక్రమం ద్వారా అభిమానులతో పంచుకుంటూ వుంటారు. తాజాగా ఆయన ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు గుమ్మడి గురించి ప్రస్తావించారు. "దర్శకుడు వేజెళ్ల సత్యనారాయణ గారు 'ఈ పిల్లకి పెళ్లవుతుందా?' సినిమాలో నాతో ఒక నిరుద్యోగి వేషం వేయించారు. సినిమా కోసం ముఖానికి మేకప్ వేసుకోవడం అదే తొలిసారి.

అసలే నాకు కొత్త .. మొదటి రోజే వేజెళ్ల గారు 400 అడుగుల షాట్ పెట్టారు. నటిస్తూనే బూట్లు విప్పడం .. నటిస్తూనే బట్టలు విప్పేసి తగిలించడం .. ఇలా చాలా సహజంగా ఆ సీన్ చేయాలి. అక్కడే వున్న గుమ్మడిగారు "ఇక ఈ రోజుకి అయినట్టే" అన్నారు. 'సార్ .. ఫస్టు టైమ్ మేకప్ వేసుకున్నాను .. మీరు అలా అనకండి .. పెద్దవారిగా ఆశీర్వదించండి' అన్నాను. ఆ తరువాత ఆ షాట్ ని ఫస్టు టేక్ లోనే చేసేశాను. గుమ్మడిగారు వెంటనే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు' అని చెప్పుకొచ్చారు.   

More Telugu News