Telangana: నేటి నుంచి మద్యం షాపులు బంద్.. మళ్లీ తెరుచుకునేది అప్పుడే

  • నేటి సాయంత్రంతో 5 నుంచి మద్యం అమ్మకాలు బంద్
  • నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
  • ఇప్పటికే పెద్ద ఎత్తున స్టోర్ చేసుకున్న అభ్యర్థులు?

తెలంగాణలో నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారమే కాదు మద్యం దుకాణాలు కూడా బంద్ కానున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ జరగనున్న 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని మద్యం షాపులకు నోటీసులు పంపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు అమల్లో ఉన్న సమయాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తే జైలుకు పంపుతామన్నారు.  

మద్యం షాపులు మూతపడనున్న నేపథ్యంలో పలువురు నేతలు ఇప్పటికే జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. మద్యాన్ని ముందస్తుగా కొనుగోలు చేసి స్టోర్ చేసినట్టు సమాచారం. పోలింగ్‌కు ముందు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు మద్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మద్యం పెద్ద ఎత్తున చేరాల్సిన చోటుకి చేరుకుందని అంటున్నారు. అభ్యర్థుల ఇళ్లపై దాడులు చేస్తే మద్యం పట్టుబడే అవకాశం ఉందని చెబుతున్నారు.

More Telugu News