Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • అరకు పిల్లల కోసం కాజల్ స్కూలు 
  • 'నట సామ్రాట్' పనుల్లో కృష్ణవంశీ 
  • మరో షెడ్యూల్ కి 'అమృతవర్షిణి'

*  అందాల కాజల్ అగర్వాల్ మనసు కూడా అందమైనదే అన్నది కొద్దిమందికే తెలుసు. ఎందుకంటే, తాను చేసే సేవా కార్యక్రమాల గురించి ఆమె మీడియాకు ఎప్పుడూ చెప్పుకోదు. అయితే, తాజాగా ఆ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. విశాఖ సమీపంలోని అరకు ప్రాంతంలో గిరిజన పిల్లల కోసం కాజల్ ఓ స్కూలును ఏర్పాటు చేసింది. 'థింక్ పీస్' అనే స్వచ్చంద సంస్థ ద్వారా కాజల్ అరకులో ఈ స్కూలును నిర్మించిందట.
*  ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. మరాఠీలో వచ్చిన 'నట సామ్రాట్' చిత్రాన్ని ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో ఆయన రీమేక్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయి.
*  నందమూరి తారకరత్న హీరోగా తెలుగు, కన్నడ భాషల్లో 'అమృతవర్షిణి' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. కాగా ఈ చిత్రం తొలి షెడ్యూలు షూటింగ్ పూర్తయింది. శివప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూలు ఈ నెల 10 నుంచి జరుగుతుంది.

More Telugu News