మహేశ్ మూవీలో మీనాక్షి దీక్షిత్!

04-12-2018 Tue 18:04
  • డిఫరెంట్ లుక్స్ తో మహేశ్ బాబు 
  • విలేజ్ సెట్లో చిత్రీకరణ 
  • తెరపైకి మీనాక్షి దీక్షిత్ పేరు  
ప్రస్తుతం మహేశ్ బాబు 'మహర్షి' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగు కొనసాగుతోంది. ఇక్కడ వేసిన విలేజ్ సెట్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు కాలేజ్ స్టూడెంట్ గా .. కార్పొరేట్ సంస్థకి సీఈఓగా .. గ్రామంలో రైతుల సమస్యలను పరిష్కరించే యువకుడిగా కనిపించనున్నాడు.

మహేశ్ బాబు సరసన కథానాయికగా పూజా హెగ్డే అలరించనుంది. ఈ సినిమాలో మరో కథానాయికగా సోనాల్ చౌహాన్ కనిపించనుందనే వార్తలు షికారు చేశాయి. తాజాగా తెరపైకి మీనాక్షి దీక్షిత్ పేరు వచ్చింది. త్వరలో ఈ సుందరి షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. గతంలో ఈమె కొన్ని తెలుగు చిత్రాల్లో మెరిసింది. సోనాల్ చౌహాన్ తో పాటు ఈ అమ్మాయిని తీసుకున్నారా? లేదంటే సోనాల్ చౌహన్ ప్లేస్ లో తీసుకున్నారా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.