హాస్యరస ప్రధానంగా 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'

04-12-2018 Tue 17:28
  • కామెడీ కథా చిత్రాల దర్శకుడిగా నాగేశ్వర రెడ్డి 
  • సందీప్ కిషన్ జోడిగా హన్సిక 
  • ఈ నెల 14 నుంచి రెగ్యులర్ షూటింగ్  

హాస్యరస ప్రధానమైన కథా చిత్రాలను జి.నాగేశ్వర రెడ్డి ఎక్కువగా తెరకెక్కిస్తూ వుంటారు. గతంలో ఆయన తెరకెక్కించిన 'సీమశాస్త్రి'.. 'సీమటపాకాయ్'.. 'దేనికైనా రెడీ'.. 'కరెంట్ తీగ' సినిమాలు కామెడీపై నాగేశ్వర రెడ్డికి గల పట్టుకు నిదర్శనంగా నిలుస్తాయి. అలాంటి నాగేశ్వర రెడ్డి త్వరలో మరో కామెడీ సినిమాకి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు .. దాని పేరే 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'.

సందీప్ కిషన్ .. హన్సిక జంటగా ఆయన ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుని, అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టనుంది. ఎస్ఎన్ఎస్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ప్రతి పాత్ర ప్రత్యేకంగా అనిపిస్తూ నవ్వులు పూయిస్తుందని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియపరచనున్నారు.