sensex: ఆరు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 106 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 14 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 10 శాతం వరకు పెరిగిన ఈక్విటాస్ హోల్డింగ్స్

అంతర్జాతీయంగా సానుకూలతలు లేకపోవడం, అమెరికా-చైనాలు వాణిజ్య యుద్ధాన్ని పరిష్కరించుకుంటాయో, లేదో అనే అనుమానాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 106 పాయింట్లు నష్టపోయి 36,164కు పడిపోయింది. నిఫ్టీ 14 పాయింట్లు కోల్పోయి 10,869 వద్ద స్థిరపడింది.

టాప్ గెయినర్స్:
ఈక్విటాస్ హోల్డింగ్స్ (9.96%), థర్మాక్స్ (7.64%), ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (5.92%), ట్రైడెంట్ లిమిటెడ్ (5.87%), ఐసీఐసీఐ లొంబార్డ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ (5.86%).

టాప్ లూజర్స్:
శంకర బిల్డింగ్ ప్రాడక్ట్స్ (-10.00%), క్వాలిటీ (-4.91%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (-4.70%), క్వెస్ కార్పొరేషన్ (-4.60%), ఎల్గి ఎక్విప్ మెంట్స్ (-4.59%).      

More Telugu News