Revanth Reddy: రేవంత్ రెడ్డికి స్వల్ప అస్వస్థత

  • రేవంత్ కు పెరిగిన బీపీ లెవెల్స్
  • జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో చికిత్స
  • రేవంత్ ను విడుదల చేయాలని ఆదేశించిన ఎన్నికల సంఘం

పోలీసుల అదుపులో ఉన్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో, జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఆయనకు చికిత్స అందించారు. రేవంత్ కు బీపీ ఎక్కువయిందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. మరోవైపు, రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ డీజీపీని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ ఆదేశించిన సంగతి తెలిసిందే. రేవంత్ అరెస్ట్ పై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ఆదేశాలతో రేవంత్ ను అరెస్ట్ చేశారని పోలీసులను ప్రశ్నించింది. 

More Telugu News