Telangana: రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయండి.. తెలంగాణ డీజీపీకి ఈసీ ఆదేశం!

  • కోస్గీలో కేసీఆర్ ను అడ్డుకుంటామన్న రేవంత్
  • ఈరోజు తెల్లవారుజామున అరెస్ట్ చేసిన పోలీసులు
  • రేవంత్ మాయంకావడంపై హైకోర్టుకెళ్లిన కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కొడంగల్ లోని కోస్గీలో ఈరోజు సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా ఆశీర్వాద సభను అడ్డుకుంటామని రేవంత్ ప్రకటించడంతో అధికారులు ఆయన్ను ఇంటి నుంచి అరెస్ట్ చేసి తీసుకుపోయారు. దీంతో రేవంత్ భార్య గీతతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై స్పందించిన తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్.. శాంతిభద్రతల సమస్య రావొచ్చన్న ఉద్దేశంతోనే రేవంత్ ను అరెస్ట్ చేశామన్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అరెస్టుపై హైకోర్టులో ప్రత్యేక లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని వెంటనే విడిచిపెట్టాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని రజత్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ పోలీసులు కోర్టుకు విన్నవించనున్నారు.

More Telugu News