Revanth Reddy: రేవంత్ రెడ్డి కారును పోలీసులు వెనక నుంచి ఢీ కొట్టించి, తాళం వేసుకుని వెళ్లిపోయారు: రేవంత్ అనుచరులు

  • రాత్రి పోలీసులు సడన్ గా వచ్చారు
  • రేవంత్ ను తీసుకెళుతుంటే మేము ఫాలో అయ్యాం
  • రాత్రంతా రోడ్డుపైనే ఉన్నాం

కొడంగల్ లో తన నివాసంలో ఉన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి రేవంత్ నివాసానికి వెళ్లిన పోలీసులు, ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సీఎం సభ సమయంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేందుకే రేవంత్ ను అరెస్ట్ చేసినట్టు వికారాబాద్ ఎస్పీ తెలిపారు.

మరోవైపు, ఈ ఘటనపై రేవంత్ అనుచరులు మీడియాకు వివరించారు. 'రాత్రి పోలీసులు సడన్ గా వచ్చారు. పడుకున్న మమ్మల్ని లేపారు. ఏదో మాట్లాడి వెళ్లిపోతారని మేము అనుకున్నాం. సార్ ని తీసుకుని వెళ్తున్నారు. పోలీసు వాహనాన్ని మేము అనుసరించాం. మేము వస్తున్న కారును వెనుక నుంచి ఢీ కొట్టించి, రోడ్డు పక్కన ఆపించి, తాళం వేసి వెళ్లి పోయారు. రాత్రంతా మేము నడి రోడ్డుపైనే ఉన్నాం. ఈ కారు రేవంత్ రెడ్డిదే' అని రేవంత్ అనుచరులు తెలిపారు.

More Telugu News