Chandrababu: చంద్రబాబు ఓ చెత్త, థర్డ్ క్లాస్ నాయకుడు.. మీడియాను మేనేజ్ చేస్తాడు!: కేసీఆర్

  • చంద్రబాబు కు సిద్ధాంతాలు లేవు
  • కాంగ్రెస్, బీజేపీతో ఆయన కలిశారు
  • 95-107 స్థానాల్లో ఘనవిజయం సాధిస్తాం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓ పద్ధతి, సిద్ధాంతం అంటూ లేవని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. తొలుత బీజేపీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు ఆ తర్వాత తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో జోడీ కట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అసలు నేత కాదనీ, ఆయన ఓ మీడియా మేనేజర్ మాత్రమేనని దుయ్యబట్టారు. ఇండియాటుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ పలు అంశాలపై ముచ్చటించారు.

చంద్రబాబు దేశంలోనే ఓ చెత్త నాయకుడనీ, థర్డ్ క్లాస్ రాజకీయ నేత అని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలతో తమకు పోటీ లేదని స్పష్టం చేశారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ కూడా ఇందిరాగాంధీ వ్యతిరేక ఉద్యమాన్ని ఒక్కరే ప్రారంభించారనీ, తాను కూడా తెలంగాణ ఉద్యమాన్ని అలాగే మొదలుపెట్టుకున్నానని గుర్తుచేసుకున్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రత్యామ్నాయంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 11న తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత తాను దేశమంతా పర్యటిస్తాననీ, విధివిధానాలను ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తాము 95-107కు పైగా స్థానాల్లో ఘనవిజయం సాధిస్తామని ప్రకటించారు.

More Telugu News