Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మరో కొత్తపాత్రలో రానున్న అనుష్క 
  • 'భైరవ గీత'కు వర్మ వాయిస్ ఓవర్
  • కోచ్ పాత్రలో కనిపించనున్న విజయ్

*  'భాగమతి' సినిమా తర్వాత బాగా గ్యాప్ తీసుకుని అనుష్క చేస్తున్న చిత్రం 'సైలెన్స్'. మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అనుష్క పాత్ర చాలా ఫెరోషియస్ గా, వైలెంట్ గా సాగుతుందని అంటున్నారు.
*  ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన 'భైరవ గీత' చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. నూతన దర్శకుడు సిద్ధార్థ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వర్మ వాయిస్ ఓవర్ చెప్పారు. అక్కడక్కడ తన వాయిస్ ఓవర్ తో వర్మ చిత్ర కథను నడుపుతారట.
*  ఇటీవల 'సర్కార్' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న తమిళ స్టార్ హీరో విజయ్ తన తదుపరి చిత్రాన్ని అట్లీకుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. క్రీడల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విజయ్ కోచ్ పాత్రలో కనిపిస్తాడట. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తోంది.

More Telugu News