Hanuman: హనుమంతుడు దళితుడంటూ సీఎం యోగి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ సొంత పార్టీ మంత్రి

  • హనుమంతుడు అణగారిన వర్గ దళితుడు
  • దేవుళ్లను కులాల పేరుతో విభజించడం తప్పు
  • ఇలాంటి వ్యాఖ్యలతో వివాదాలు సృష్టించొద్దు

‘హనుమంతుడు అడవుల్లో పుట్టిన, అణగారిన వర్గానికి చెందిన దళితుడు. ‘భజరంగ బలి’ ఉత్తరం నుంచి దక్షిణం దాకా, తూర్పు నుంచి పడమర వరకు భారత దేశంలోని అన్ని వర్గాలను ఏకంచేసేందుకు కృషిచేశారు’ అంటూ ఇటీవల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సొంత పార్టీ మంత్రే యోగిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ దేవుళ్లను కులాల పేరుతో విభజించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నేడు షాల్మీ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓం ప్రకాశ్ మాట్లాడుతూ.. యోగి వ్యాఖ్యల కారణంగా దళితులు హనుమాన్ దేవాలయాల స్వాధీనం కోసం డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో వివాదాలు సృష్టించొద్దని హితవు పలికారు.

More Telugu News