thamannah: 'సైరా'లో నా పాత్ర ఏమిటనేది సస్పెన్స్: తమన్నా

  • తమన్నా తాజా చిత్రంగా 'నెక్స్ట్ ఏంటి'
  • లండన్ లో అధిక భాగం చిత్రీకరణ 
  • ఈ నెల 7వ తేదీన భారీస్థాయి రిలీజ్   

తమన్నా తాజా చిత్రంగా 'నెక్స్ట్ ఏంటి' ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. సందీప్ కిషన్ జోడీగా ఆమె నటించిన ఈ సినిమాకి కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువభాగం షూటింగ్ 'లండన్' లో జరిగింది. రొమాంటిక్ లవ్ స్టోరీగా నిర్మితమైన ఈ సినిమాను, ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నారు.

 ఈ సందర్భంగా తమన్నా ఈ సినిమాను గురించి మాట్లాడుతూ, 'సైరా' సినిమాను గురించి ప్రస్తావించింది. చిరంజీవి కెరియర్లో చెప్పుకోదగినదిగా నిర్మితమవుతోన్న 'సైరా' సినిమాలో భాగస్వామిని కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో నేను చేస్తోన్న పాత్ర ఏమిటనేది అప్పుడే చెప్పలేను .. ఇంకా షూటింగ్ చేయవల్సిన సన్నివేశాలు వున్నాయని అంది. దాంతో ఈ సినిమాలో తమన్నా పాత్ర ఎలా వుండనుందో .. ఎలా కనిపించనుందో అనేది ఆసక్తికరంగా మారింది. 'బాహుబలి' వంటి భారీ సినిమాలో నటించి మెప్పించిన తమన్నాకి, 'సైరా'వంటి మరో భారీ ప్రాజెక్టులో చోటు లభించడం నిజంగా అదృష్టమే.    

More Telugu News