sensex: అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంపై తొలగిన భయాందోళనలు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 47 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 7 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 16 శాతం పైగా లాభపడ్డ రిలయన్స్ కమ్యూనికేషన్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దిగుమతులపై అదనపు పన్నుల భారాన్ని మోపకూడదంటూ జీ20 సమావేశాల్లో అమెరికా, చైనాలు ఒక అంగీకారానికి వచ్చిన నేపథ్యంలో, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 47 పాయింట్లు పెరిగి 36,241కు చేరింది. నిఫ్టీ 7 పాయింట్లు లాభపడి 10,884కు పెరిగింది.

టాప్ గెయినర్స్:
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (16.47%), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (12.16%), ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (9.24%), టాటా పవర్ (7.80%), సుజ్లాన్ ఎనర్జీ (7.77%).  
 
టాప్ లూజర్స్:
శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ (-10.00%), సన్ ఫార్మా (-7.52%), ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (-5.44%), క్వాలిటీ (-4.94%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (-4.79%).      

More Telugu News