state election commission: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌

  • ఎన్నో సవాళ్లు ఎదురైనా నెలరోజుల్లోనే అన్నీ ఓ కొలిక్కితెచ్చాం
  • బోగస్‌గా గుర్తించిన 4.93 లక్షల ఓట్ల తొలగింపు
  • అభ్యర్థుల క్రిమినల్‌ రికార్డులు, పార్టీ మ్యానిఫెస్టోలు పరిశీలిస్తున్నాం

ఎన్నికల నిర్వహణ ఓ సవాల్‌ వంటిదని, నెలరోజుల తక్కువ వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ సందర్భంగా న్యాయపరంగా పలు సమస్యలు ఎదుర్కొన్నామని చెప్పారు.

 కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లను పర్యవేక్షించడంతో మంచి మార్గదర్శకత్వం లభించినట్లయిందన్నారు. బోగస్‌ ఓట్లుగా భావించి 4 లక్షల 93 వేల మందిని జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు. అభ్యర్థుల క్రిమినల్‌ రికార్డులు సేకరించామని, వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. పార్టీ మేనిఫెస్టోలు, హామీలను పరిశీలిస్తున్నామని తెలిపారు.

More Telugu News