anasuya: అనసూయ తిరిగొచ్చేసింది .. వర్షిణి గ్లామర్ కి ఫిదా!

  • 'జబర్దస్త్' కామెడీ షోకి క్రేజ్ 
  • అనసూయ తప్పుకుందంటూ పుకార్లు 
  • యూత్ మనసు దోచుకున్న వర్షిణి

బుల్లితెరపై 'జబర్దస్త్' కామెడీ షోకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ షోకి గ్లామర్ తీసుకొచ్చిన ఘనత అనసూయకే  దక్కుతుంది. అలాంటి అనసూయ కొన్ని వారాలుగా 'జబర్దస్త్' కామెడీ షోలో కనిపించలేదు. ఆమె స్థానంలో 'వర్షిణి' కార్యక్రమాన్ని నడిపిస్తూ వస్తోంది. సినిమాల్లో అవకాశాలు పెరిగిపోవడంతో, 'జబర్దస్త్' నుంచి అనసూయ తప్పుకుందని వార్తలు ఊపందుకున్నాయి. ఆమె తప్పుకోవడానికి పారితోషికం విషయంలో వచ్చిన తేడాలు అనే టాక్ కూడా బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ప్రసారమైన 'జబర్దస్త్' షోలో అనసూయ ప్రత్యక్షమై .. ఎప్పటిలానే సందడి చేసింది. ఆమె ఈ షోకి తిరిగి రావడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడిపోయింది. అయితే ఈ గ్యాప్ లో వచ్చిన 'వర్షిణి' కూడా గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. యూత్ లో ఇప్పుడు ఈ అమ్మాయికి ఫాలోయింగ్ పెరిగిపోతుండటం విశేషం.

More Telugu News