kalyan ram: ఆసక్తిని రేకెత్తిస్తోన్న కల్యాణ్ రామ్ న్యూ మూవీ టైటిల్ లోగో

  • గుహన్ దర్శకత్వంలో 118
  • నాయికలుగా నివేదా .. షాలిని 
  • జనవరిలో ప్రేక్షకుల ముందుకు

కొంతకాలంగా కల్యాణ్ రామ్ కి చెప్పుకోదగిన సక్సెస్ లేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ఈ నేపథ్యంలోనే 'గుహన్' వినిపించిన కథ నచ్చడంతో, ఆయనతో సినిమా చేశాడు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా నిర్మితమైంది. రీసెంట్ గా ఈ సినిమాకి '118' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

తాజాగా ఈ టైటిల్ లోగోను ఈ రోజున రిలీజ్ చేశారు. సినిమాపై కుతూహలాన్ని పెంచేలా ఈ టైటిల్ లోగోను డిజైన్ చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన కథానాయికలుగా నివేదా థామస్ .. షాలిని పాండే నటించారు. జనవరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే కల్యాణ్ రామ్ నమ్మకం ఎంతవరకూ నెరవేరుతుందో చూడాలి. 

More Telugu News