Jammu And Kashmir: పీవోకే పాకిస్తాన్ దే.. కశ్మీరీలు స్వయం ప్రతిపత్తి కోసం పోరాడాలి!: ఫరూక్ అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

  • పీవోకేలో పండిట్ల కోసం ఆలయాన్ని నిర్మించాలి
  • కశ్మీర్ కోసం భారత్-పాక్ ల మధ్య శాంతి కీలకం
  • పోరాడాలా,వద్దా అన్నది కశ్మీరీలే నిర్ణయించుకోవాలి

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1947లో దేశ విభజన అనంతరం పాకిస్తాన్ ఆక్రమించుకున్న కశ్మీర్(పీవోకే) పాక్ కే చెందుతుందని తెలిపారు. భారత్ లో ఉన్న కశ్మీర్ ఇండియాదేనని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడాలా, వద్దా అనేది నిర్ణయించుకోవాల్సిందే కశ్మీర్ ప్రజలేనని స్పష్టం చేశారు.

కశ్మీర్ పండిట్ల కోసం పీవోకేలో శారదాపీఠం ఆలయాన్ని ప్రారంభించాలని కోరారు. భారత్, పాకిస్తాన్ ల మధ్య స్నేహం నెలకొంటే కశ్మీర్ సమస్య దానంతట అదే పరిష్కారమయిపోతుందని వ్యాఖ్యానించారు. కశ్మీర్ పూర్తిగా తమ దేశంలో అంతర్భాగమనీ, పీవోకే నుంచి పాక్ వైదొలగాలని భారత్ వాదిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు భారత్ లో కశ్మీర్ లో హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

More Telugu News