Andhra Pradesh: కనకదుర్గమ్మ గుడిలో ప్రక్షాళన.. పలువురు ఉద్యోగులపై బదిలీ వేటు!

  • అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న ఆలయం
  • పూజారులు, సూపరింటెండెంట్ లు బదిలీ
  • ప్రోటోకాల్ పాటించలేదంటున్న ఉద్యోగులు

ఇటీవలి కాలంలో చీరల దొంగతనం, మొమెంటో అవినీతి ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్న విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో ప్రక్షాళన మొదలయింది. తాజాగా దుర్గమ్మ గుడిలో 63 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఆలయ ఈవో కోటేశ్వరమ్మ ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో పలువురు పూజారులు కూడా ఉన్నారు. కాగా, ఈవో తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ కు లోనయ్యారు.

  ఒకే చోట ఉద్యోగులు తిష్ట వేయడం కారణంగా అవినీతి చోటుచేసుకుంటోందనీ, భక్తులకు సైతం ఇబ్బందిని కలిగిస్తున్నారని ఈవో సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కారణంగానే కోటేశ్వరమ్మ 63 మంది ఆలయ ఉద్యోగులపై బదిలీ వేటు వేశారని పేర్కొన్నాయి. వీరిలో ఎక్కువమంది సూపరింటెండెంట్, రికార్డ్స్ అసిస్టెంట్, ఎన్ఎంఆర్ స్థాయి ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు. కాగా ప్రధాన ఆలయ బాధ్యతలను సూపరింటెండెంట్ కు ఈవో అప్పగించారు. కాగా, ఈ బదిలీలు ప్రోటోకాల్  ప్రకారం జరగలేదని పలువురు ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

More Telugu News