Madhya Pradesh: ఈవీఎంల దగ్గరికొస్తే కాల్చిపారేయండి.. మధ్యప్రదేశ్ కలెక్టర్ ఆదేశాలు

  • ముగిసిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు
  • ఈవీఎంల భద్రతపై విపక్షాల ఆందోళన
  • స్ట్రాంగ్ రూముల వద్దకు వస్తే కఠిన చర్యలు
  • రీవా జిల్లా కలెక్టర్ ప్రీతి మైథిలి 

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత, ఈవీఎంల భద్రతపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ, రీవా జిల్లా కలెక్టర్ ప్రీతి మైథిలి సంచలన ఆదేశాలు జారీచేశారు. భోపాల్ లోని ఓ స్ట్రాంగ్ రూమ్ లో అమర్చిన సీసీటీవీ కెమెరాలు పని చేయక పోవడం పలు అనుమానాలకు తావివ్వగా, ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూముల్లో రక్షణ సిబ్బందిని పెంచుతున్నామని, ఈవీఎంల దగ్గరకు ఎవరైనా వస్తే వారిని కాల్చిపారేయాలని ప్రీతి మైథిలి ఆదేశించారు. కాంగ్రెస్ నేత అభయ్ మిశ్రాతో పాటు స్ట్రాంగ్ రూమ్‌ లను పరిశీలించిన ఆమె, ఈవీఎంలు భద్రంగానే ఉన్నాయని అన్నారు. ఈ ప్రాంతంలోకి ఎవరు వచ్చినా కఠిన చర్యలు ఉంటాయని, 11వ తేదీ వరకూ అనుక్షణం ఈవీఎంలను కాపాడతామని తెలిపారు.

More Telugu News