Madhya Pradesh: భోపాల్ లో ఈవీఎంలు దాచిన స్ట్రాంగ్ రూముల్లో పని చేయని సీసీ కెమెరాలు... రంగంలోకి దిగిన ఈసీ!

  • మధ్యప్రదేశ్ అభ్యర్థుల భవితవ్యాన్ని దాచుకున్న ఈవీఎంలు
  • గంట పాటు పని చేయని సీసీటీవీ కెమెరాలు
  • ట్యాంపరింగ్ జరిగిందంటున్న కాంగ్రెస్
  • అటువంటిదేమీ లేదని ఈసీ వివరణ

మధ్యప్రదేశ్ కు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తరువాత, ఈవీఎంలను దాచివుంచిన స్ట్రాంగ్ రూముల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలు పనిచేయక పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక్కడ దాచిన ఈవీఎంలలో ఫలితాలను మార్చేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపిస్తున్న వేళ, ఈసీ రంగంలోకి దిగింది.

సీసీటీవీ కెమెరాలు గంట పాటు పని చేయలేదన్న విషయాన్ని అంగీకరించిన అధికారులు, ఈవీఎంల ట్యాంపరింగ్ జరగలేదని స్పష్టం చేశారు. పవర్ కట్ కారణంగా ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది.

సీసీటీవీ కెమెరాలు, స్ట్రాంగ్ రూమ్ బయటున్న ఎల్ఈడీ టీవీపై నిత్యమూ గదిని రికార్డు చేస్తున్న దృశ్యాలను ప్రసారం చేస్తున్నాయని, శుక్రవారం నాడు ఉదయం 8.19 గంటల నుంచి 9.35 వరకూ ఇవి పని చేయలేదని అధికారులు వ్యాఖ్యానించారు. ఈ స్ట్రాంగ్ రూముకు నిరంతర విద్యుత్ సరఫరాకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

More Telugu News