juniorNTR: అక్క కోసం తమ్ముడు ప్రచారానికి వచ్చేనా?... జూనియర్‌ ఎన్టీఆర్‌ నిర్ణయం తేలేది నేడే!

  • సోదరి సుహాసిని తరపున ప్రచారంపై రాని స్పష్టత
  • ఒకటిన వస్తారని గతంలో ప్రకటించిన పెద్దిరెడ్డి
  • ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న జూనియర్‌

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రచారంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నియోజక వర్గంలో మహాకూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ తనయ సుహాసిని పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్క తరపున ఆమె తమ్ముడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒకటో తేదీన ప్రచారం చేస్తారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి గతంలో ప్రకటించారు.

అయితే శనివారం నాటికి ఈ విషయంపై ఎటువంటి స్పష్టత రాలేదు. రాజమౌళి నిర్మిస్తున్న కొత్త చిత్రం షూటింగ్‌తో ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌ బిజీగా ఉన్నారు. దీంతో ఆయన ప్రచారంపై ఇప్పటి వరకు స్పష్టత రాకపోవడంతో టీడీపీ వర్గాల్లో అయోమయం నెలకొంది. ఆదివారం ఈ అంశంపై ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

More Telugu News