Samantha: ఆ పాత్ర గురించి తెలుసుకున్నాక చాలా భయపడ్డా: సమంత

  • మరో ఆసక్తికరమైన పాత్రలో సమంత
  • నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం
  • కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’కి రీమేక్

ఇటీవల ‘రంగస్థలం’ సినిమాలో ఇంతకు మునుపెన్నడూ చేయనటువంటి పాత్రలో నటించి ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న సమంత తాజాగా మరో ఆసక్తికరమైన పాత్రలో నటించేందుకు సిద్ధమవుతోందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ‘పాత్ర గురించి తెలుసుకొన్నాక నేను చాలా భయపడ్డా. కానీ నేనెప్పుడూ సవాల్‌ని స్వీకరించకుండా వెనకడుగు వేయలేదు.

మనం అనుకొన్నదానికంటే మనలో ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉంటాయి’ అని సమంత ట్వీట్‌లో పేర్కొంది. అయితే ఈ ట్వీట్ నందిని రెడ్డి దర్శకత్వంలో చేయబోయే సినిమా గురించేనని నెటిజన్లు భావిస్తున్నారు. కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’ రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో సామ్ 70 ఏళ్ల వృద్ధురాలిగా కనిపించనుందని సమాచారం.

More Telugu News