simbu: 'అత్తారింటికి దారేది' రీమేక్ నుంచి టీజర్

  • పవన్ కల్యాణ్ పాత్రలో శింబు
  • కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

పవన్ కల్యాణ్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో 'అత్తారింటికి దారేది' ఒకటిగా కనిపిస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి, అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. అలాంటి ఈ సినిమాను తమిళంలో శింబు హీరోగా, 'వంత రాజవతాన్ వరువేన్' అనే టైటిల్ తో రీమేక్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి సుందర్. సి దర్శకత్వం వహించాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. ఈ కథలోని లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన టీజర్ ఆకట్టుకునేలా వుంది. భారీస్థాయిలో ఖర్చు పెట్టేసి సినిమాను చాలా రిచ్ గా తీశారనే విషయం ఈ టీజర్ ను బట్టి అర్థమైపోతోంది. రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషించగా, కథానాయికలుగా కేథరిన్ .. మేఘా ఆకాశ్ కనువిందు చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

More Telugu News