Hyderabad: నా ఓటు 'నోటా'కే అంటూ హైదరాబాదులో భారీ ప్రచారం

  • తమ బాధలను అర్థం చేసుకోలేని పార్టీలపై క్యాబ్ డ్రైవర్ల ఆగ్రహం
  • నోటాకే ఓటు వేయాలంటూ క్యాబ్ లపై పోస్టర్లు
  • ప్రజలకు మేలు చేయని పార్టీలకు ఓటు వేయవద్దంటూ విన్నపం

కారు గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు, హస్తం గుర్తుకే మన ఓటు... తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈ నినాదాలతో అందరి చెవులు మారుమోగుతున్నాయి. మరో వైపు... నా ఓటు నోటాకే అంటూ మరో ప్రచారం హైదరాబాదులో పెద్ద ఎత్తున సాగుతోంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. హైదరాబాదులోని క్యాబ్ డ్రైవర్లు ఈ వినూత్న ప్రచారానికి తెరతీశారు. తమ సమస్యలను పట్టించుకోని పార్టీలకు ఓటు వేయవద్దని ప్రచారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కేవలం నినాదాలకే పరిమితం కాకుండా... తమ వాహనాలపై పోస్టర్లను కూడా అతికించారు.

వోలా, ఉబెర్ యాజమాన్యాల మోసాల నుంచి తమను కాపాడాలని పార్టీల నేతల వద్ద మొరపెట్టుకున్నా... ఏ ఒక్కరూ స్పందించలేదని తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సలావుద్దీన్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలకు మేలు చేయని పార్టీలకు ఓటు వేయవద్దని... నోటాకు ఓటు వేయాలని కోరుతున్నామని ఆయన తెలిపారు. హైదరాబాదు రోడ్లపై వందల సంఖ్యలో క్యాబ్ లు తిరుగుతున్న నేపథ్యంలో, వీరి ప్రచారం జనాలకు చేరువవుతోంది. 

More Telugu News