paruchuri: ఆత్మల విషయంలో ఆడియన్స్ ను రాహుల్ నమ్మించగలిగాడు: 'టాక్సీవాలా' గురించి పరుచూరి

  • ఆత్మల కథను చక్కగా డీల్ చేశాడు 
  • ఎక్కడ ఏ అంశాన్ని చెప్పాలో తెలుసు 
  • పాటలు లేకపోయినా లోటు తెలియలేదు  

ఎన్నో చిత్రాల విజయంలో ప్రధానమైన పాత్రను పోషించిన పరుచూరి గోపాలకృష్ణ తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో 'టాక్సీవాలా' సినిమాను గురించి ప్రస్తావించారు. "ఆత్మలకి సంబంధించిన కథలను డీల్ చేయడం అంత తేలికైన విషయం కాదు. ఆత్మలకి సంబంధించిన విషయంలో ముందుగా ఆడియన్స్ ను నమ్మించవలసి ఉంటుంది. ఒక మనిషిలోనుంచి ఆత్మ బయటికొచ్చి మరొక ఆత్మతో మాట్లాడుతుంది అంటే ఆడియన్స్ నమ్మకపోగా ఎగతాళి చేస్తారు.

ఎగతాళి చేసే ఆ విషయాన్ని కన్నీళ్లు పెట్టించి మరీ నమ్మించాడు దర్శకుడు రాహుల్. కథలో ఏ అంశాన్ని ఎక్కడ వరకూ దాచాలో .. ఎక్కడ ఆ అంశాన్ని ఆడియన్స్ కి చెప్పాలో రాహుల్ కి బాగా తెలుసు. అందువల్లనే కథ పట్టుగా నడుస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో ప్రేమ పాటలు లేకపోయినా ఆడియన్స్ వాటిని గురించి పెద్దగా పట్టించుకోలేదంటే, అందుకు కారణం కథలోని గొప్పతనమేనని చెప్పాలి" అని అన్నారు.    

More Telugu News