Andhra Pradesh: అథ్లెటిక్స్ లో ఆంధ్రప్రదేశ్ ను కేంద్రంగా మారుస్తాం!: మంత్రి అమర్నాథ్ రెడ్డి

  • పోటీలను ప్రారంభించిన మంత్రి అమర్నాథ్ రెడ్డి
  • ఆనంద ఆంధ్రప్రదేశ్ లో క్రీడలు చాలా ముఖ్యం
  • ఏపీలో వరుస పోటీలు జరగడం శుభపరిణామం

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో యువ ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అమర్ నాథ్ రెడ్డి తెలిపారు. ఆనంద ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో క్రీడలు చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. క్రీడల ద్వారా మనసు, శరీరం ఆరోగ్యంగా ఉంటాయనీ, చెడు ఆలోచనలు, అలవాట్లు దరిచేరవని పేర్కొన్నారు. ఏపీలోని తిరుపతిలో ఉన్న తారకరామ మైదానంలో అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ మీట్ నిడ్జమ్-2018ను మంత్రి ఈ రోజు ప్రారంభించారు.

అనంతరం మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో పలు ప్రతిష్ఠాత్మక పోటీలను వరుసగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్ పోటీలకు ఏపీని కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను సానబట్టేందుకు, ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జాతీయ స్థాయిలో ఏపీ ఆటగాళ్లు రాణించేలా మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 

More Telugu News