Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • అనుష్క సినిమాలో మాధవన్ 
  • రవితేజ 'డిస్కో రాజా' అప్ డేట్
  • ఎన్టీఆర్ బయోపిక్ లో వెన్నెలకిషోర్ 
  • తమిళంలోకి అఖిల్ సినిమా

*  గత కొన్నాళ్లుగా గ్యాప్ తీసుకున్న అందాల అనుష్క మళ్లీ ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో నటించనుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో మాధవన్ కీలక పాత్ర పోషిస్తాడు.
*  ఇటీవల 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ తన తదుపరి చిత్రాన్ని వీఐ ఆనంద్ దర్శకత్వంలో చేస్తున్నాడు. సైంటిఫిక్ ఎంటర్ టైనర్ గా రూపొందించే ఈ చిత్రానికి 'డిస్కో రాజా' అనే పేరు కూడా అనుకుంటున్నారు. త్వరలో షూటింగును ప్రారంభించుకునే ఈ చిత్రంలో రవితేజ రెండు పాత్రల్లో నటిస్తాడు.
*  క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ 'కథానాయకుడు'లో హాస్య నటుడు వెన్నెల కిషోర్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఎన్టీఆర్ బావమరిది, మేనేజరు అయిన రుక్మానాధరావు పాత్రలో వెన్నెల కిషోర్ కనిపిస్తాడని తెలుస్తోంది.
*  అఖిల్ అక్కినేని నటించిన 'హలో' చిత్రాన్ని తమిళంలోకి అనువదిస్తున్నారు. కల్యాణి ప్రియదర్శిన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తమిళ వెర్షన్ ని ఈ నెలలోనే విడుదల చేస్తారు.

More Telugu News