Hyderabad: ఎన్నికల ప్రచారం కోసం రేపు హైదరాబాద్ కు చంద్రబాబు

  • హైదరాబాద్ లో బాబు ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
  • రేపు మధ్యాహ్నం కూకట్ పల్లిలో ప్రచారం
  • మణికొండ, చిత్రపురి కాలనీ, ఖాజాగూడలో కూడా

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు ఉదయం హైదరాబాద్ రానున్నారు. కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని తరపున ఆయన ప్రచారంలో పాల్గొననున్నారు. హైదరాబాద్ లో చంద్రబాబు ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను ఆ పార్టీ ఖరారు చేసింది.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రాజేంద్రనగర్, కూకట్ పల్లి నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం కూకట్ పల్లిలో ఆయన ప్రచారం చేస్తారు. జేఎన్టీయూ, కేపీహెచ్బీ కాలనీ, కూకట్ పల్లి, వై-జంక్షన్, మూసాపేట, మోతీనగర్ మీదుగా ప్రచారం కొనసాగనుంది. మణికొండ, చిత్రపురి కాలనీ, ఖాజాగూడలో నిర్వహించే ప్రచారంలో కూడా చంద్రబాబు పాల్గొంటారని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

More Telugu News