Varun Tej: ‘అంతరిక్షం’ నుంచి ‘సమయమా’ లిరికల్ సాంగ్ రిలీజ్

  • వరుణ్ తేజ్ హీరోగా ‘అంతరిక్షం’
  • ప్రశాంత్ విహారి సంగీతం
  • డిసెంబర్ 21న విడుదల

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ‘ఘాజీ’ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంతరిక్షం’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై క్రిష్ జాగర్లమూడి సమర్పణలో స్పేస్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. టాలీవుడ్‌లో ఇప్పటి వరకూ చూడని కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

వరుణ్ తేజ్ సరసన అదితిరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘సమయమా’ వీడియోను నేడు చిత్రబృందం విడుదల చేసింది. అనంత శ్రీరామ్ అందించిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రశాంత్ విహారి అందించిన సంగీతం సినిమాను మరో మెట్టు ఎక్కించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News