kcr: కేసీఆర్ ఆలీబాబా అయితే, ఆ నలుగురూ దొంగలు: పంజాబ్ మంత్రి సిద్ధూ

  • కేటీఆర్, కవిత, హరీశ్ రావు, సంతోష్ లు దొంగలు
  • తెలంగాణలో ఖజానాను కేసీఆర్ ఖాళీ చేశారు
  • కుటుంబ ఆస్తిని పెంచుకున్నారు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ ఆలీబాబా అయితే, కేటీఆర్, కవిత, హరీశ్ రావు, సంతోష్ లు నలుగురూ దొంగలని అన్నారు. తెలంగాణలో ఖజానాను కేసీఆర్ ఖాళీ చేశారని, కుటుంబ ఆస్తిని పెంచుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో మహిళా సాధికారత అంటే కవిత ఒక్కటేనా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని, ఏడాదిలో లక్ష ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆయన విమర్శలు గుప్పించారు. రైతులకు అయితే రుణాలు ఇవ్వరు కానీ, అంబానీ, ఆదానీ కంపెనీలకు మాత్రం రుణాలు మాఫీ చేస్తారని మండిపడ్డారు. మోదీ ఏ దేశమైనా వెళ్లొచ్చా? నేను పాకిస్థాన్ వెళితే తప్పా? అని ప్రశ్నించారు. తాము అంతా రాహుల్ గాంధీ సైనికులమని, చెడు రోజులు పోయాయని, రాహుల్ రాబోతున్నారని, వచ్చే ఏడాది ఎర్రకోట నుంచి జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.   

More Telugu News