Shahrukh Khan: షారూఖ్ ఖాన్ షూటింగ్ సెట్లో అగ్ని ప్రమాదం

  • పాట కోసం వేసిన సెట్లో అగ్ని ప్రమాదం
  • దగ్ధమైన షూటింగ్ పరికరాలు
  • షారూఖ్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపిన పోలీసులు

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ సినిమా షూటింగ్ సెట్లో నిన్న సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ పాట చిత్రీకరణ కోసం వేసిన సెట్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం నేపథ్యంలో అక్కడ దట్టమైన పొగ అలముకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ ప్రమాదంలో షూటింగ్ కోసం వినియోగించే పరికరాలు దగ్ధమయ్యాయి. ప్రమాదం సమయంలో షారూఖ్ అక్కడే ఉన్నారు. అయితే, ఆయనకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని పోలీసులు తెలిపారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో షారూక్ సరసన కత్రినా కైఫ్, అనుష్క శర్మలు నటిస్తున్నారు. షారూఖ్ ఖాన్ మరుగుజ్జు పాత్రను పోషిస్తున్నారు.  

More Telugu News