BJP: విపక్షాలు కలిస్తే... బీజేపీకి అధికారం కష్టమే: యూపీపై టైమ్స్ నౌ - సీఎన్ ఎక్స్ సర్వే

  • 80 లోక్ సభ నియోజకవర్గాలున్న యూపీ
  • 2014 ఎన్నికల్లో 71 సీట్లు గెలిచిన బీజేపీ
  • కూటమి ఏర్పడితే బీజేపీకి నష్టమన్న సర్వే

దేశంలో అత్యధిక లోక్ సభ నియోజకవర్గాలున్న ఉత్తర ప్రదేశ్ లో చక్రం తిప్పి, అధిక సీట్లను గెలుచుకుంటే, కేంద్రంలో అధికారం పొందడం సులువవుతుందని భావిస్తున్న బీజేపీ, తనవంతు ప్రణాళికలు రూపొందిస్తున్న వేళ, రాష్ట్రంలోని విపక్షాలన్నీ కలిస్తే బీజేపీకి అధికారం కష్టమేనని 'టైమ్స్ నౌ - సీఎన్ఎక్స్ ' తాజా సర్వే వెల్లడించింది. దేశం మొత్తంలో 543 లోక్ సభ సీట్లుండగా, ఒక్క యూపీలోనే 80 స్థానాలున్న సంగతి తెలిసిందే. 2014లో బీజేపీ ఇక్కడ 71 సీట్లను గెలుచుకుంది.

ఇక వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో విపక్షాలు కలసి కూటమిగా ఏర్పడకుంటే బీజేపీ 49 స్థానాల్లో గెలుస్తుందని సర్వే తేల్చింది. అంటే, 2014తో పోలిస్తే 16 సీట్లు తక్కువన్నమాట. ఇదే సమయంలో ఎస్పీ, బీఎస్పీలకు చెరో తొమ్మిది, కాంగ్రెస్ కు 5, ఇతరులకు 2 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక కూటమి ఏర్పడితే (ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీ) 49 సీట్లు వారికి వస్తాయని, బీజేపీ 31 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. ఇక ఎస్పీ, బీఎస్పీలు మాత్రమే కలిసి పోటీ చేస్తే, కూటమికి 33 సీట్లు, బీజేపీకి 45 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కు రెండు సీట్లు రావచ్చని పేర్కొంది.

More Telugu News