kishan reddy: మెజారిటీ లేని నేతలే సీఎంలు, పీఎంలు అయ్యారు.. నేనూ అవుతా: బీజేపీ నేత కిషన్ రెడ్డి

  • తెలంగాణలో బీజేపీ గెలిస్తే నేనే సీఎం
  • నన్ను ఓడించే కుట్రలు జరుగుతున్నాయి
  • ఒవైసీ ఫత్వాను ముస్లింలు తిప్పికొడతారు

కాలం కలిసొస్తే తెలంగాణకు తాను ముఖ్యమంత్రిని అవుతానని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. మెజారిటీ లేని నేతలే ముఖ్యమంత్రులు, ప్రధానులు అవుతున్నారని, కాబట్టి తాను కూడా సీఎంను అవుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ గెలిస్తే తాను సీఎంను కావడం తథ్యమన్నారు. గురువారం ఆయన అంబర్‌పేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. తనను ఓడించేందుకు దారుస్సలాంలో కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఒవైసీ కుటుంబం జారీ చేసే ఫత్వాను అంబర్‌పేట ముస్లింలు అంగీకరించరని పేర్కొన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ కుట్రలను ఇక్కడి ప్రజలు అంగీకరించరని, వాటిని తిప్పికొట్టడం ఖాయమన్నారు. మైనారిటీల సమస్యలపై తాను ఎన్నో పోరాటాలు చేశానని, వారి మద్దతు తనకు ఉందని అన్నారు. ప్రజల అండదండలతో నాలుగోసారి గెలవడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News