SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. డిపాజిట్ రేట్ల పెంపు

  • మెచ్యూరిటీలపై 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల పెంపు
  • రూ. కోటి వరకు ఉన్న డిపాజిట్లపై 6.8 శాతం
  • సాధారణ పౌరుల కంటే వయోవృద్ధులకు 0.50 శాతం అధికం

ఖాతాదారులకు  భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) శుభవార్త చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. మెచ్యూరిటీలపై 5 నుంచి 10 బేసిస్ పాయింట్లను పెంచింది. కోటి రూపాయల వరకు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రస్తుతం ఉన్న6.7 శాతం వడ్డీ రేటును 6.8 శాతానికి,  సీనియర్‌ సిటిజన్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటును 7.2 నుంచి 7.3శాతానికి పెంచినట్టు తెలిపింది.

అలాగే, సాధారణ పౌరులకు ఇచ్చే వడ్డీ రేటు కంటే వయోవృద్ధుల డిపాజిట్లపై 0.50 శాతం వడ్డీ ఎక్కువ ఇవ్వనున్నట్టు తెలిపింది. పెంచిన వడ్డీ రేట్లు బుధవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు వివరించింది. ఇటీవల ప్రైవేటు రంగ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించడంతో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

More Telugu News