Madhya Pradesh: మధ్యప్రదేశ్ విచిత్రాలు... ఓటేసేందుకు గోడను బద్దలు కొట్టారు!

  • ఈ ఉదయం నుంచి ప్రారంభమైన పోలింగ్
  • తలుపు చిన్నగా ఉండి ఓటర్లకు ఇబ్బందులు
  • గోడను పగుల గొట్టించిన అధికారులు

ఈ ఉదయం నుంచి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం కాగా, పలు ప్రాంతాల నుంచి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో, ఓటేసేందుకు వచ్చిన ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు వెనుదిరిగి వెళ్లారు. ఇటార్సీ జిల్లా నాలా మొహల్లా ఛాత్రవాస్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో ఓటేసేందుకు అనువుగా లేదంటూ ఓ గోడను బద్దలు కొట్టించారు అధికారులు.

ఈ కేంద్రాన్ని చిన్న గదిలో ఏర్పాటు చేయడం, లోపలి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఓటర్లు ఇబ్బందులు పడుతూ ఉండటంతో, అక్కడి అధికారులు, పోలీసులు గోడను పగులగొట్టించారు. కాగా, ఈ ఉదయం 11 గంటల వరకూ 29 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించారు. మొత్తం 230 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News