Maoists: తప్పుకున్న గణపతి... మావోయిస్టుల కొత్త సారధిగా బసవరాజు

  • కొత్త సారధిగా సంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్
  • స్వచ్ఛందంగా తప్పుకున్న గణపతి
  • ఆయన సేవలు అమూల్యమైనవన్న పార్టీ

మావోయిస్టు పార్టీ కొత్త సారధిగా సంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ ను నియమిస్తున్నట్టు ఆ పార్టీ కేంద్ర కమిటీ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈ మేరకు మీడియాకు ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా ఉన్న గణపతి స్వచ్ఛందంగా తప్పుకున్నారని తెలిపింది. గడచిన 26 సంవత్సరాలుగా పార్టీకి ఆయన ఎంతో అమూల్యమైన సేవ చేశారని ఈ లేఖలో మావోయిస్టు కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ వెల్లడించారు. సుదీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తున్న బసవరాజు నేతృత్వంలో మరింతగా బలపడతామన్న నమ్మకముందని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News