Pooja: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'మహర్షి'లో జాయిన్ అయిన పూజా హెగ్డే
  • చరణ్ సినిమాలో కేథరిన్ స్పెషల్ సాంగు   
  • విడుదలలో రజనీ '2.ఓ' కొత్త రికార్డు 

*  వారం రోజుల పాటు 'హౌస్ ఫుల్ 4' హిందీ సినిమా షూటింగులో పాల్గొన్న అనంతరం కథానాయిక పూజా హెగ్డే తిరిగి 'మహర్షి' చిత్రంలో జాయిన్ అయింది. హైదరాబాదు సమీపంలోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన విలేజ్ సెట్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.
*  రాంచరణ్, బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న 'వినయ విధేయ రామ' చిత్రానికి సంబంధించి ఇక ఒక పాట మిగిలి వున్న సంగతి విదితమే. ఈ ప్రత్యేక గీతంలో నటించడానికి తాజాగా కేథరిన్ త్రెసాను ఎంపిక చేసినట్టు సమాచారం.
*  రజనీకాంత్ నటించిన '2.ఓ' చిత్రం విడుదలలో రికార్డు సృష్టిస్తోంది. రేపు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ వెర్షన్లలో కలిపి మొత్తం పదివేల థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

More Telugu News