rehana fathima: శబరిమలలో ప్రవేశించేందుకు యత్నించిన రెహనా ఫాతిమా అరెస్ట్

  • అక్టోబర్ 18న శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఫాతిమా
  • మత విద్వేషాలను రెచ్చగొట్టారంటూ అరెస్ట్
  • ఇస్లాం మతం నుంచి బహిష్కరించిన ముస్లి జమాయత్ కౌన్సిల్

గత నెలలో అయ్యప్పస్వామి ఆలయంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేసిన ఫాతిమా రెహనాను కేరళలోని పదనాంతిట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్ బుక్ ద్వారా మత విశ్వాసాలను గాయపరిచారనే ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆమెను కేరళ ముస్లిం జమాయత్ కౌన్సిల్ కూడా ఇస్లాం మతం నుంచి వెలివేసింది. ఆమె పోస్ట్ లతో లక్షలాది మంది హిందువుల మనోభావాలు గాయపడ్డాయని కౌన్సిల్ తెలిపింది.

తన కుటుంబసభ్యులతో కలసి అక్టోబర్ 18న ఫాతిమా రెహనా శబరిమల ఆలయానికి బయల్దేరింది. అయితే ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఆమె సన్నిధానం వరకు చేరుకోలేకపోయారు. ఆపై సోషల్ మీడియా ద్వారా ఆమె తన గళం వినిపించారు. ఈ క్రమంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ఫాతిమాపై చర్యలు తీసుకోవాలని గత వారం కేరళ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అక్టోబర్ 22న ఆమెపై కేసు నమోదైంది. 2004లో కొచ్చిలో జరిగిన కిస్ ఆఫ్ లవ్ ప్రచారంలో కూడా ఆమె పాల్గొంది. 

More Telugu News