sundeepkishan: 'నెక్స్ట్ ఏంటి' నుంచి బ్యూటిఫుల్ సాంగ్

  • రొమాంటిక్ కామెడీగా 'నెక్స్ట్ ఏంటి'
  • డిసెంబర్ 7వ తేదీన విడుదల 
  • హిట్ కోసం సందీప్ వెయిటింగ్      

సందీప్ కిషన్ .. తమన్నా జంటగా కునాల్ కోహ్లీ దర్శకత్వంలో 'నెక్స్ట్ ఏంటి' అనే సినిమా రూపొందింది. నవదీప్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను డిసెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. 'హో నో నెవర్ ..' అంటూ ఈ పాట కొనసాగుతోంది. ఫారిన్ లోని అందమైన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారు.

హీరోగా సందీప్ కిషన్ కి కొంతకాలంగా హిట్ లేదు. దాంతో ఆయన సక్సెస్ సాధించాలనే పట్టుదలతో వున్నాడు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో సాగే ఈ సినిమా తనకి హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఆయన వున్నాడు. ఇక తమన్నాకి కూడా తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. ఆమెకి కూడా ఈ సినిమా హిట్ చాలా అవసరం. ఈ ఇద్దరికీ కావలసిన హిట్ ను ఈ సినిమా అందిస్తుందేమో చూడాలి.

More Telugu News