New Delhi: ఈసారి ఏకంగా బుల్లెట్లతో కేజ్రీవాల్ వద్దకు... ముందే పసిగట్టి అరెస్ట్ చేయడంతో తప్పిన ముప్పు!

  • గత వారంలో కారంపొడితో దాడి
  • తాజాగా కేజ్రీవాల్ ను కలిసేందుకు వచ్చిన ముస్లిం ప్రతినిధులు
  • ఓ వ్యక్తి వద్ద ఐదు లైవ్  బుల్లెట్లు
  • విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కల్పిస్తున్న భద్రతపై మరోసారి సందేహాలు వ్యక్తమయ్యాయి. గత వారంలో ఆయనపై కారంపొడితో దాడిని మరువకముందే, ఈ దఫా ఓ వ్యక్తి ఏకంగా ఐదు లైవ్ బుల్లెట్లతో కేజ్రీవాల్ వద్దకు వచ్చాడు. అయితే, ఈ విషయాన్ని ముందే పసిగట్టిన పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

కొందరు ముస్లిం ప్రతినిధులు కేజ్రీవాల్ ను కలిసేందుకు రాగా, వారిలో మొహమ్మద్ ఇమ్రాన్ అనే వ్యక్తి వద్ద ఈ బుల్లెట్లు లభ్యమయ్యాయి. అతన్ని తనిఖీ చేస్తుండగా, వాలెట్ లో ఈ బుల్లెట్లు సెక్యూరిటీ గార్డులకు కనిపించాయి. దీంతో ఆయుధాలను కలిగివున్నాడన్న నేరంపై అతన్ని అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని మస్జిద్ బావ్లీ వాలీకి ఇమ్రాన్ కేర్ టేకర్ గా ఉన్నాడని పోలీసులు తెలిపారు.

కాగా, ఈ  బుల్లెట్లు తనకు మసీదులోని హుండీలో లభ్యమయ్యాయని, వాటిని తాను వాలెట్ లో ఉంచుకుని, మరచిపోయానని నిందితుడు చెప్పినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అతన్ని విచారిస్తున్నామని అధికారులు తెలిపారు.

More Telugu News