nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • విజయ్ సరసన నయనతార 
  • ఏడు సినిమాల్లో నందిత శ్వేత 
  • 'ఆర్ఎక్స్ 100' దర్శకుడితో వర్మ

*  అటు స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తూనే, మరోపక్క హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తున్న నయనతార తాజాగా విజయ్ సరసన నటించడానికి ఓకే చెప్పింది. అట్లీ కుమార్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ జనవరి నుంచి జరుగుతుంది. క్రీడల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
*  ఇటీవల 'శ్రీనివాస కల్యాణం' చిత్రంలో హీరోయిన్ గా నటించిన నందిత శ్వేత ప్రస్తుతం తెలుగులో తాను చాలా బిజీగా వున్నట్టు చెప్పింది. తెలుగులో ఏకంగా ఏడు సినిమాలు ఒప్పుకున్నట్టు తెలిపింది. కొన్ని షూటింగు దశలో వుండగా, మరికొన్ని మొదలవుతాయని చెప్పింది.
*  తాజాగా 'భైరవగీత' చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ త్వరలో మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తాడని వర్మ ప్రకటించారు.

More Telugu News