amarinder singh: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కు వార్నింగ్ ఇచ్చిన పంజాబ్ ముఖ్యమంత్రి

  • భారత్ ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగానే ఉంటుంది
  • మా సైనిక సత్తా ఏమిటో తెలుసుకోండి
  • ఏ దేశమైనా అవతలి ప్రాంతానికి వెళ్లి దాడులు చేయమని చెబుతుందా?

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కమర్ బజ్వాకు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగానే ఉంటుందని... మా సైనిక సత్తా ఏమిటో తెలుసుకోవాలని అన్నారు. తాము శాంతినే నమ్ముతామని... ఇతర దేశాలకు కూడా అదే సందేశాన్ని పంపుతామని చెప్పారు. ఏ దేశ సైన్యమైనా అవతలి ప్రాంతంలోకి వెళ్లి దాడులు చేయమని చెబుతుందా? అని ప్రశ్నించారు. ముంబై ఉగ్రదాడులు జరిగి పదేళ్లయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. అమరీందర్ సింగ్ భారత ఆర్మీ అధికారిగా పని చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు, పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ సిద్దూ మాట్లాడుతూ, పాకిస్థాన్ తనకు రెండో సొంతిల్లు వంటిదని చెప్పారు. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించినందుకు పాకిస్థాన్ కు ధన్యవాదాలు తెలిపారు.

More Telugu News