Revanth Reddy: టీఆర్ఎస్ కూటమికి 70కి పైగా సీట్లు వస్తాయన్న సర్వేలపై రేవంత్ రెడ్డి స్పందన

  • 100 సీట్లు గెలుస్తామన్న కేసీఆర్ ఇప్పుడు 70కి తగ్గారు
  • ఇంకా 10 రోజులు ఉన్నాయి.. టీఆర్ఎస్ సీట్లు మరో 30 తగ్గుతాయి
  • టీఆర్ఎస్ కు 35 నుంచి 40 సీట్లు మాత్రమే వస్తాయి

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం కూటమికి 70కి పైగా సీట్లు వస్తాయని ఇటీవల ఓ జాతీయ మీడియా తన సర్వేలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కూడా చెబుతున్నారు. ఈ అంశంపై ఓ టీవీ చానల్ రేవంత్ ను ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చారు. ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని తొలుత కేసీఆర్ చెప్పారని... ఇప్పుడు ఆయన 70కి తగ్గారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ఇంకా 10 రోజుల సమయం ఉందని... ఈ 10 రోజుల వ్యవధిలో వారికి వచ్చే సంఖ్య మరో 30 తగ్గుతుందని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ 35 నుంచి 40 సీట్లకు మించి గెలవదని అన్నారు.

ఓటుకు నోటు కేసు వల్ల హైదరాబాదు నుంచి చంద్రబాబు పారిపోయారని కేసీఆర్ ఇంతకు ముందు అన్నారని... ఇప్పుడు చంద్రబాబు మళ్లీ వస్తున్నాడంటూ సీన్ క్రియేట్ చేస్తున్నారని... దీని అర్థం చంద్రబాబు పారిపోలేదు అనే కదా అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసు విషయంలో కేసీఆర్ ఏమైనా చేయాలనుకుంటే ఇప్పుడు చేయవచ్చు కదా? అని అన్నారు.

More Telugu News