sydney: సిడ్నీ టీ20: ఆసీస్ వెన్ను విరిచిన కృణాల్ పాండ్యా

  • 6 వికెట్లకు 164 పరుగులు చేసిన ఆస్ట్రేలియా
  • 36 పరుగులకు 4 వికెట్లు కూల్చిన కృణాల్ పాండ్యా
  • టీమిండియా విజయలక్ష్యం 165 పరుగులు

సిడ్నీలో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు ఓపెనర్లు ఫించ్, షార్ట్ లు భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరూ కలసి 8.3 ఓవర్లలో 68 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం 28 పరుగులు చేసిన ఫించ్ ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. కుల్దీప్ బౌలింగ్ లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఫించ్ వెనుదిరిగాడు. ఆ తర్వాత కృణాల్ పాండ్యా విశ్వరూపం ప్రదర్శించాడు. వరుసగా షార్ట్ (33), మెక్ డెర్మాట్ (డకౌట్), మ్యాక్స్ వెల్ (13), క్యారీ (27) లను పెవిలియన్ చేర్చాడు. అనంతరం 13 పరుగులు చేసిన లిన్ రనౌట్ గా వెనుదిరిగాడు.

చివర్లో స్టోయినిస్ 15 బంతుల్లో 25 పరుగులతో, కోల్టర్ నైల్ 7 బంతుల్లో 13 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కాసేపట్లో 165 పరుగుల లక్ష్య ఛేదనకు టీమిండియా దిగనుంది.

More Telugu News