TRS: ఎన్నికల ప్రణాళికపై టీఆర్‌ఎస్‌ తుది కసరత్తు.. నేడో, రేపో విడుదల చేసే అవకాశం

  • కేకే ఆధ్వర్యంలోని ముసాయిదా కమిటీ పలు వర్గాల నుంచి విజ్ఞాపనల స్వీకరణ
  • నేడు సీఎం కేసీఆర్‌ను కలిసి చర్చించే అవకాశం
  • అనంతరం ప్రణాళిక ఖరారు చేసి విడుదల చేయాలని నిర్ణయం

ముందస్తుగా ప్రజల నిర్ణయాన్ని స్వీకరించేందుకు సిద్ధపడిన తెలంగాణలోని టీఆర్‌ఎస్‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల ప్రణాళిక రూపొందించి విడుదల చేసేందుకు తుది కసరత్తు మొదలుపెట్టింది. సీనియర్‌ రాజకీయ నాయకుడు కె.కేశవరావు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇప్పటికే ఉద్యోగ, వ్యాపార, సామాన్య వర్గాల నుంచి విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు. వారి వినతులు విన్నారు.

ప్రధానంగా ఉద్యోగ, యువజన, మహిళా సంఘాలు, వీఆర్‌ఓలు, వీఏఓలు, పంచాయతీ కార్యదర్శులు కలిసి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కోరుకుంటున్న సేవలను వివరించారు. వీటన్నింటినీ సావధానంగా విన్న కమిటీ ఇప్పటికే ముసాయిదా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ అంశాలపై సీఎం కేసీఆర్‌తో చర్చించిన కేకే ఆదివారం ఆయనతో సమావేశమై చర్చించే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితమే కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళిక విడుదల కావాల్సి ఉన్నా అది ఆదివారానికి వాయిదా పడింది. ఒకవేళ కాంగ్రెస్‌ ఆదివారం ప్రణాళిక విడుదలచేస్తే ఆ వెంటనే తమ ప్రణాళిక కూడా విడుదల చేయాలని టీఆర్‌ఎస్‌ భావిస్తున్నట్లు సమాచారం.

More Telugu News